ప్రత్యమ్నాయ ఇంధన వాహనాలపై దృష్టి పెట్టాలి : మంత్రి నితిన్‌ గడ్కరీ

న్యూఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌ కార్ల వినియోగాన్ని తగ్గించాలని రవాణ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలను ఉపయోగించాలని సూచించారు. ఫ్లెక్స్‌ ఫ్యూయెల్‌ వాహనాలపై జిఎస్‌టిని 12 శాతానికి తగ్గించాలన్నారు.
శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించి, జీవ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. దీని కోసం వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల మద్దతు అవసరమని తెలిపారు. ఫ్లెక్స్‌ ఫ్యూయెల్‌ వాహనాలు ఒకటి కంటే ఎక్కువ రకాల ఇంధనంతో లేదా మిశ్రమంతో నడుస్తుంది. అంటే పెట్రోల్‌ మరియు ఇథనాల్‌ లేదా మిథనాల్‌ మిశ్రమం. ఇది పెట్రోల్‌ దిగుమతులను తగ్గిస్తుంది. తద్వారా దేశ ఆర్తిగా పరిస్థితి మరింత మెరుగుపడుతుందన్నారు. హీరో, బజాజ్‌ వంటి ద్విచక్ర వాహన తయారీ సంస్థలు భారత్‌లో తయారు చేసే బైక్‌లలో 50 శాతం ఎగుమతి చేస్తున్నాయని గడ్కరీ చెప్పారు. జీవ ఇంధనం కోసం మనం మంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంటే.. ఎగుమతులు 10 నుండి 20 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేశారు.

➡️