భారత వృద్ధి అంచనాలకు మూడీస్‌ కోత

న్యూఢిల్లీ: భారత వృద్ధి రేటు అంచనాలకు ప్రముఖ గ్లోబల్‌ రేటింగ్‌ ఎజెన్సీ మూడీస్‌ కోత పెట్టింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత జిడిపి 7 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. ఇంతక్రితం 2023-24లో 8.2 శాతం వృద్ధి చోటు చేసుకున్న విషయాన్ని గుర్తు చేసింది. 2025 మార్చితో ముగియనున్న ఏడాదిలో భారత జిడిపి 6.4 శాతానికే పరిమితం కావొచ్చని ఇటీవల స్వయంగా కేంద్ర గణంకాల శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుత 2024-25లో ప్రధానంగా అంతర్జాతీయ మందగమనం, దేశీయ బలహీనతలు వృద్ధి రేటు తగ్గుదలకు ప్రధాన కారణమని మూడీస్‌ పేర్కొంది. ఫిక్కీ, ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఇతర ఎజెన్సీలు 6.5 శాతం దిగువనే వృద్ధి ఉండొచ్చని ఇటీవల అంచనా వేశాయి.

➡️