మోతీలాల్‌ ఓస్వాల్‌ కొత్త లోగో ఆవిష్కరణ

న్యూఢిల్లీ : మోతిలాల్‌ గ్రూపునకు చెందిన మోతిలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్సీయల్‌ సర్వీసెస్‌ కొత్త బ్రాండ్‌ లోగోను ఆవిష్కరించింది. దీంతో నూతన శకాన్ని ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. లోగోలోని ఆక్స్‌పర్డ్‌ నీలం రంగు చురుకైన ప్రొఫెషనలిజం, విలువైన వారసత్వం, కాలాతీత స్థిరత్వం, జాగ్రత్తగా పండించిన నైపుణ్యాన్ని తెలియజేస్తుందని ఎంఒఎస్‌ఎల్‌ గ్రూప్‌ ఎండి, సిఇఒ మోతీలాల్‌ ఓస్వాల్‌ పేర్కొన్నారు. గత 37 ఏళ్లుగా తాము ఈ రంగంలో ఉన్నామన్నారు. ఈ లోగో ఇప్పుడు కొత్త దృక్పథంతో బలమైన పరిశోధన, సలహాలను అందించడానికి నిబద్ధత కలిగి ఉందన్నారు.

➡️