- రూ.85 కోట్ల కోసం బోర్డు ఆమోదం
హైదరాబాద్: ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్, సర్వీసు సెక్టార్ కంపెనీ నెట్‌లింక్స్ రూ.85 కోట్ల నిధులను సమీకరించనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం సోమవారం తమ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపినట్లు నెట్‌లింక్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్క కోటి ఫుల్ ఆఫ్ పెయిడ్ ఈక్విటీ షేర్లను రూ.85 చొప్పున జారీ చేయడం ద్వారా ఈ నిధులను అందుకోనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రిపర్షియల్ షేర్ల కేటాయింపునకు గాను 2025 మార్చి 5న ఎక్ష్రర్డినరీ జనరల్‌బాడీ మీటింగ్ (ఇజిఎం)ను ఏర్పాటు చేయనున్నట్లు నెట్‌లింక్స్ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ లోక రెడ్డి తెలిపారు. కంపెనీని మరింత బలోపేతం చేయడానికి, వృద్ధికి మద్దతును అందుకోవడానికి ఈ నిధులను ఉపయోగించనున్నామన్నారు.