సామ్‌సంగ్‌ నుంచి కొత్త ఎఐ రిఫ్రిజిరేటర్లు

May 16,2024 21:28 #Business, #samsung

గూర్‌గావ్‌ : సామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ కొత్తగా భారత మార్కెట్లోకి తదుపరి తరం ఎఐ ఇన్వర్టర్‌ కంప్రెసర్‌ టెక్నాలజీ గల మూడు కొత్త రిఫ్రిజిరేటర్లను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. వీటిలో 809 లీటర్లు, 650 లీటర్ల నాలుగు డోర్ల రిఫ్రిజిరేటర్లు ఉన్నాయని.. వీటి ధరల శ్రేణీ రూ.1.72 లక్షలు, రూ.1.88లక్షలు, రూ.3.55 లక్షలుగా నిర్ణయించింది. కంప్రెషర్‌కు 20 ఏళ్ల వారంటీ ఇస్తున్నట్లు తెలిపింది. 10 శాతం వరకు ఇంధన ఆదా సామర్థ్యం కలిగి ఉన్నాయని తెలిపింది.

➡️