హయర్‌ నుంచి కొత్త గ్రాఫైట్‌ రేంజ్‌ రిఫ్రిజిరేటర్లు

Jun 11,2024 21:25 #Business

న్యూఢిల్లీ : ప్రముఖ గృహోపకరణాల ఉత్పత్తుల సంస్థ హయర్‌ కొత్తగా గ్రాఫైట్‌ శ్రేణీ రిఫ్రిజరేటర్స్‌ను విడుదల చేసినట్లు వెల్లడించింది. రెండు, మూడు డోర్ల వేరియంట్లలో వైఫై ఎనేబుల్డ్‌ స్మార్ట్‌ రేంజ్‌లో వీటిని డిజైన్‌ చేసినట్లు తెలిపింది. గ్రాఫైట్‌ సిరీస్‌పై 10 సంవత్సరాల కంప్రెసర్‌ వారంటీ, 2 సంవత్సరాల ఉత్పత్తి వారంటీని అందిస్తోన్నట్లు పేర్కొంది. వీటి ప్రారంభ ధరను రూ.24,690గా నిర్ణయించింది.

➡️