కొత్త ఎంజి కామెట్‌ ఇవి 2025 ఆవిష్కరణ

న్యూఢిల్లీ : కార్ల తయారీ కంపెనీ జెఎస్‌డబ్ల్యు, ఎంజి మోటార్‌ ఇండియా బుధవారం తన సరికొత్త కామెట్‌ ఎలక్ట్రిక్‌ కార్‌ 2025 ఎడిషన్‌ను ఆవిష్కరించింది. దీని ఎక్స్‌షోరూం ధరను రూ.4.99 లక్షలుగా నిర్ణయించింది. బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌ ఆప్షన్‌ కలిగిన ఈ కారు బ్యాటరీకి కిలోమీటర్‌కు రూ.2.5 చొప్పున అద్దె రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఎక్సైట్‌, ఎక్సైట్‌ ఎఫ్‌పి (ఫాస్ట్‌ ఛార్జింగ్‌) వేరియంట్‌ల్లో కొత్తగా పార్కింగ్‌ కెమెరా, పవర్‌ ఫోల్డింగ్‌ ఒఆర్‌ఎం ఫీచర్లను కలిగి ఉంది. సింగిల్‌ ఛార్జ్‌తో 230 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చని ఆ కంపెనీ తెలిపింది.

➡️