ఆకాయ్ నుంచి నూతన శ్రేణీ టివిలు

హైదరాబాద్‌ : వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అకాయ్ ఇండియా ఈ పండుగ సీజన్‌లో పెద్ద పరిమాణంలో 190 సెంటీమీటర్లు, 254 సెంటీమీటర్ల టివిలను ఆవిష్కరించినట్లు తెలిపింది. వీటి ధరలను వరుసగా రూ.99,900, రూ.3,99,999గా నిర్ణయించింది. ఆండ్రాయిడ్‌ 11తో నడుస్తున్న ఈ సిరీస్‌లో అధునాతన 4కె క్యుఎల్‌ఇడి డిస్‌ప్లే టెక్నాలజీ, డాల్బీ విజన్‌, డాల్బీ అట్మాస్‌ సౌండ్‌ ఫీచర్లు ఉన్నాయని పేర్కొంది. వీటిపై రెండేళ్ల వారంటీ ఉంటుందని తెలిపింది.

➡️