హైదరాబాద్ : ఆన్‌లైన్ బీమా వేదిక రెన్యూబై కొత్తగా రెన్యూబై స్మార్ట్ టర్మ్ ప్లాన్‌ను ఆవిష్కరించినట్లు తెలిపింది. దీన్ని ఎల్‌ఐసి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, డిజిట్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో ప్రారంభించినట్లు ప్రకటించింది. వృత్తి నిపుణులు, చిన్న వ్యాపార యాజమానుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్మార్ట్ టర్మ్ ప్లాన్‌ను రూపొందించినట్లు పేర్కొంది. ఇందులో 10 ఏళ్ల ప్రీమియం చెల్లించి జీవితకాలం కవరేజీ పొందే అవకాశం ఉందని తెలిపింది. రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు కవరేజీ హామీ ఉంటుందని పేర్కొంది.