హైదరాబాద్ : యుపిఐ ఆధారిత చెల్లింపుల పరిష్కారాల సేవలకు గాను తమ సంస్థకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) ఆమోదం తెలిపిందని జాగల్ ప్రీపెయిడ్ ఓసియన్‌సర్వీసెస్ వెల్లడించింది. దీంతో తమ వేదికకు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (టిపిఎపి)గా వ్యవహారించడానికి అనుమతులు లభించినట్లయ్యిందని పేర్కొంది. ప్రొపెల్, సేవ్, జోయెర్, ఇఎంఎస్ వేదికల్లోని 30 లక్షల మంది ఖాతాదారులకు మద్దతు లభించనుందని జాగల్ ఛైర్మన్ రాజ్ పి నారాయనమ్ పేర్కొన్నారు.
