న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మరింత దిగివచ్చాయి. గడిచిన ఐదు రోజుల్లోనే ఏకంగా 4 శాతం తగ్గి శనివారం బ్యారెల్ ధర 73 డాలర్లుగా నమోదయ్యింది. ఇజ్రాయిల్, హెజ్బుల్లా వివాదం నెమ్మదించడం, సరఫరా ప్రమాదాలపై ఆందోళన తగ్గడం, 2025 సరఫరాను పెంచనున్నట్లు పెట్రోలియం ఎగుమతుల ఆర్గనైజేషన్ ఒపెక్ సంకేతాలు చమురు ధర తగ్గడానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. వారాంతం రోజున చమురు ధర 34 సెంట్లు లేదా 0.46 శాతం తగ్గి 72.94 వద్ద ముగిసింది. వారంలో 3.1 శాతం తగ్గగా.. ఐదు రోజుల్లో 4.8 శాతం దిగివచ్చింది.