త్వరలోనే ఓలా ఎలక్ట్రిక్‌ ఐపిఒ..!

Jun 11,2024 21:10 #Business

బెంగళూరు : ప్రముఖ విద్యుత్‌ వాహనాల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్‌ దరఖాస్తు చేసుకున్న ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపిఒ)కు స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశం ఉందని ఆ వర్గాల సమాచారం. దీంతో దేశంలో ఐపిఒకు వెళ్తున్న ఇవి స్టార్టప్‌గా ఓలా ఎలక్ట్రిక్‌ నిలువనుంది. ఇష్యూ కోసం డిసెంబర్‌ 22న దరఖాస్తు చేసుకుంది. ఈ ఇష్యూలో షేర్లను జారీ చేయడం ద్వారా రూ.5,500 కోట్ల నిధులు సేకరించాలని ఓలా ఎలక్ట్రిక్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

➡️