న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల కంపెనీ ఒప్పో తన కె12ఎక్స్ 5జి మోడల్‌లో 5 లక్షల యూనిట్లను విక్రయించినట్లు వెల్లడించింది. రూ.15లోపు విలువ కలిగిన ఈ ఫోన్లను గడిచిన సెప్టెంబర్, అక్టోబర్‌లోనే ఈ స్థాయి అమ్మకాలు జరిపినట్లు పేర్కొంది. ఇందులో 32 ఎంపి ఎఐ డ్యూయల్ కెమెరాను ఉపయోగించింది. 6జిబి ర్యామ్, 128జిబి ధరను రూ.12,999గా, 8జిబి ర్యామ్, 256జిబి ధరను రూ.15,999గా నిర్ణయించింది.