ఏప్రిల్‌ 21న ఒప్పో కె13 5జి విడుదల

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల కంపెనీ ఒప్పో ఏప్రిల్‌ 21న తన ఒప్పో కె13 5జిని విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. 6.67 అంగుళాల అమెలెడ్‌ ఎఫ్‌హెచ్‌డి ప్లస్‌ డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్‌ను 7000 ఎంఎహెచ్‌ బ్యాటరీ, 80 వాట్‌ సూపర్‌వుక్‌ చార్జర్‌తో ఆవిష్కరించనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌4 ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.

➡️