ఫోన్‌పేలో పసిడి పొదుపు స్కీం

న్యూఢిల్లీ : ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల వేదిక ఫోన్‌ పే కొత్తగా పసిడి పొదుపు స్కీంను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. డైలీ సేవింగ్స్‌ పేరుతో దీన్ని ఆవిష్కరించింది. ఇందుకోసం మైక్రో సేవింగ్స్‌ ప్లాట్‌ఫామ్‌ జార్‌తో భాగస్వామ్యం కుదుర్చికుంది. ఇది తమ ఖాతాదారులు రోజువారీ చిన్న పెట్టుబడి ద్వారా 24 క్యారెట్ల డిజిటల్‌ బంగారంలో డబ్బును ఆదా చేయడానికి వీలు కల్పిస్తుందని ఫోన్‌పే తెలిపింది. ఇందులో రోజుకు కనిష్టంగా రూ.10 నుంచి గరిష్టంగా రూ.5వేల వరకు పెట్టుబడి పెట్టచ్చని పేర్కొంది.

➡️