న్యూఢిల్లీ : ప్రముఖ తినుబండారాల సంస్థ హల్దీరామ్‌లో వాటాల కొనుగోలుపై కార్పొరేట్ గ్లోబల్ దిగ్గజం పెప్సీకో దృష్టి పెట్టిందని సమాచారం. ఆ సంస్థలో వాటాల స్వాధీనం కోసం చర్చలు ప్రారంభించిందని రిపోర్టులు వస్తోన్నాయి. అగర్వాల్ కుటుంబం నిర్వహిస్తున్న హల్దీరామ్‌లో మైనారిటీ వాటా 10 శాతం కోసం ఇప్పటికే టెమాసెక్, ఆల్ఫావేస్ గ్లోబల్ సంప్రదింపులు చేస్తుండగా.. తాజాగా ఈ రేసులో పెప్సీకో చేరింది. హల్దీరామ్ విలువను రూ.85,000-90,000 కోట్లు లెక్కగట్టినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ దాదాపుగా 500 వరకు ఉత్పత్తులను విక్రయిస్తోంది.
