శ్రీలంకలోని పిక్‌మితో ఫోన్‌పే భాగస్వామ్యం

Jun 11,2024 21:20 #Business

న్యూఢిల్లీ : శ్రీలంకలో భారతీయ పర్యాటకులకు నిరంతరాయ యుపిఐ ఆధారిత క్యూఆర్‌ చెల్లింపులకు వీలు కల్పించడం కోసం శ్రీలంకలోని ప్రముఖ రైడ్‌ హెయిలింగ్‌ (క్యాబ్‌ సర్వీసులు) ప్లాట్‌ఫారం పిక్‌మితో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ఫోన్‌పే మంగళవారం ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా బండారా నాయకే అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రయాణికులు బయటకు వచ్చిన మరుక్షణం నుండి తమ పిక్‌మి రైడ్లపై క్యాష్‌లెస్‌ లావాదేవీల సౌకర్యం ద్వారా తమ ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచుకునేందుకు ఒక పెద్ద ముందడుగు పడిందని ఫోన్‌పే ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ విభాగం హెడ్‌ రితేష్‌ పారు తెలిపారు.

➡️