న్యూఢిల్లీ : గ్రామీణ, చిన్న పట్టణాల ప్రజల బ్యాంకింగ్ అవసరాలను తీర్చేందుకు ప్రత్యేకంగా ప్రగతి సేవింగ్స్ ఖాతాను అందుబాటులోకి తీసుకువచ్చామని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం తమ శాఖల్లో 51 శాతం చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లోని 4600 పైగా శాఖల్లో రైతులతో సహా, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు తక్కువ నిర్వహణ వ్యయాలతో ఈ ఖాతాలను జారీ చేయనున్నట్లు తెలిపింది.