ముంబయి : ఫిన్‌టెక్ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఏంజిల్ ట్యాక్స్‌ను రద్దు ద్వారా గత పదేళ్లలో ఈ రంగం 31 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించిందని వెల్లడించారు. శుక్రవారం ముంబయిలో ఏర్పాటు చేసిన ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024’ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. ప్రజలకు ఆర్థిక సేవలను చేరువ చేయటంలో ఫిన్‌టెక్ రంగం కీలకపాత్ర పోషించిందన్నారు. ఫిన్‌టెక్ సంస్థలతో ఆర్థిక సేవల విషయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు మధ్యనున్న అంతరాన్ని తగ్గించిందన్నారు. ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వాములను చేయడంలో డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.
