స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా ఇక కరెంట్‌ బిల్లులు చెల్లింపు : సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్

Jul 2,2024 17:32 #current bills, #Payment, #smart phone

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ (తూర్పు గోదావరి) : ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) వినియోగదారుల సౌలభ్యం కోసం విద్యుత్‌ బిల్లులను ఏపీఈపీడీసీఎల్‌ వెబ్‌ సైట్‌, మొబైల్‌ యాప్‌ ద్వారా చెల్లించవచ్చని సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పఅథ్వీతేజ్‌ ఉమ్మడి ఆదేశాలు జారీ చేశారు. ఆర్‌ బి ఐ మార్గదర్శకాలను అనుసరించి ఇక మీదట ఫోన్‌ పే, జీ పే, పేటిఎం, ఇతర యూపీఐ యాప్స్‌ లో విద్యుత్‌ బిల్లులు చెల్లించేటప్పుడు ఏపీఈపీడీసీఎల్‌ పేరు కనిపించదు అని చెప్పారు. వినియోగదారులు సంస్థ మొబైల్‌ యాప్‌ eastern power ని గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్లోడ్‌ చేసికొని గాని లేదా సంస్థ వెబ్‌ సైటు www.apeasternpower.com నుంచి గాని బిల్లులు చెల్లించవచ్చని మూర్తి తెలిపారు. ఏపీఈపీడీసీఎల్‌ మొబైల్‌ యాప్‌ లో గానీ లేదా సంస్థ వెబ్‌ సైటులోగాని బిల్లులు చెల్లించేటప్పుడు వినియోగదారులు తమ ఫోన్‌ పే, జీ పే, పేటిఎం, ఇతర యూపీఐ యాప్స్‌ తో పాటు డెబిట్‌, క్రెడిట్‌, నెట్‌ బ్యాంకింగ్‌, వాల్లెట్స్‌, కాష్‌ కార్డ్స్‌ కూడా వాడుకోవచ్చని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.

➡️