ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లకు వరుసగా మూడో రోజూ మద్దతు లభించింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఫైనాన్షియల్ స్టాక్స్, అధిక వెయిటేజీ ఉన్న స్టాక్స్‌లో కొనుగోళ్లు బుధవారం సెషన్‌లో లాభాలకు మద్దతునిచ్చాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 148 పాయింట్లు పెరిగి 75,449కి చేరింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 73 పాయింట్లు రాణించి 22,907 వద్ద ముగిసింది. బిఎస్‌ఇలో 2,894 షేర్లు లాభపడగా.. 988 షేర్లు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. మరో 110 షేర్లు యథాతథంగా నమోదయ్యాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి.
