రిజర్వు బ్యాంకు నివేదిక వెల్లడి
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : అధికధరలతో గ్రామసీమలు కన్నీరు పెడుతున్నాయని రిజర్వుబ్యాంకు తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. గత ఏడాది సెప్టెరబర్ నురచి ఈ ఏడాది మార్చి వరకు అనేక అరశాలపై గ్రామీణ ప్రారతంలో పరిస్థితిని రిజర్వ్‌బ్యారకు దేశ వ్యాప్తంగా నిర్వహించిన తాజా సర్వే విశ్లేషిరచిరది. ఈ సర్వేలో పొల్గొన్న వారిలో 95 శాతం కన్నా ఎక్కువ మంది ధరలు పెరిగాయని చెప్పారు. 3.4 శాతం మంది ధరలు నిలకడగా ఉన్నాయని చెప్పగా, కేవలం 1.5 శాతం మంది మాత్రమే ధరలు తగ్గినట్లు చెప్పడం గమనార్హం.ధరా ఘాతం నుండి విముక్తి ఇప్పుడప్పుడే లభించే అవకాశం లేదని కూడా పలువురు అభిప్రాయ పడుతున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 88.7 శాతం మంది వచ్చే ఏడాది కూడా ధరలు పెరుగుతాయని చెప్పగా, 5.4 శాతం మంది నిలకడగా ఉరటాయని, 5.9 శాతం మంది తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. వస్తువుల ధరలతో పాటు చేస్తున్న ఖర్చులు కూడా పెరుగుతున్నట్లు పలువురు అభిప్రాయ పడ్డారు. ఏకంగా 90.5 శాతం మంది ఖర్చులు పెరిగినట్లు చెప్పడం గమనార్హం. వచ్చే ఏడాది కూడా ఖర్చులు పెరిగే అవకాశం ఉందని 90.8 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ఉపాధి అవకాశాపై కూడా పల్లె ప్రజలు పెదవివిరుస్తున్నారు. 35.4 శాతం మంది ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని చెప్పగా, మరో 24.9శాతం మంది ఎటువంటి మార్పు లేదని చెప్పారు.