ప్రజాశక్తి – హైదరాబాద్ : గ్రావ్టాన్ మోటార్స్ దేశంలోనే తొలిసారి టెర్రెన్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ‘క్వాంటా’ను విడుదల చేసింది. మంగళవారం హైదరాబాద్‌లో దీనిని ఆ కంపెనీ సిఇఒ పరశురాం పాక ఆవిష్కరించారు. దీని ధరను రూ.1.2 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో దేశంలోనే తొలిసారి ఇంటిగ్రేట్ లిథియమ్ మంగనీస్ ఐరన్ పాస్పెట్ (ఎల్‌ఎంఎఫ్‌పి) బ్యాటరీని అమర్చినట్లు పరశురాం తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న తమ సంస్థ ఏడాదికి 30,000 యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. ఇది తమ ఐదేళ్ల కష్టానికి ఫలితమన్నారు. ఇప్పటి వరకు రూ.40 కోట్లు పెట్టుబడులు పెట్టామని.. వచ్చే ఏడాదిన్నరలో మరో రూ.110 కోట్ల వ్యయం చేయనున్నామన్నారు.