రుణ గ్రహీతలకు మళ్లీ నిరాశనే..
తగ్గనును జిడిపి
పెరగనున్న ద్రవ్యోల్బణం
మూల్ ఎకౌంట్స్‌పై దృష్టి
ఆర్‌బిఐ ఎంపిసి నిర్ణయాల వెల్లడి
ముంబయి : అధిక వడ్డీ రేట్లతో ఒత్తిడిని ఎదుర్కొంటున్న రుణ గ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మరోమారు నిరాశనే మిగిల్చింది. మరోవైపు రైతులకు రుణ పరిమితిని పెంచి.. వ్యవసాయ రంగానికి కొంత ఉపవశమనం కలిగించింది. డిసెంబరు 4 నుంచి మూడు రోజుల పాటు జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షా (ఎంపిసి) భేటీ నిర్ణయాలను శుక్రవారం ఆర్‌బిఐ గవరుర్ శక్తికాంత దాస్ మీడియాకు వెల్లడించారు. చిను, సనుకారు రైతులకు తనఖా రహిత వ్యవసాయ రుణాల పరిమితిని రూ.2 లక్షలకు పెంచుతున్నామన్నారు. ప్రస్తుతం ఈ పరిమితి రూ.1.6 లక్షలుగా ఉంది. పెంచిన రుణ పరిమితిని రైతులు ఎలాంటి తనఖా లేకుండా బ్యాంక్‌ల నుంచి పొందవచ్చన్నారు. పెట్టుబడి ఖర్చులు, ద్రవ్యోల్బణం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని రుణ పరిమితిని పెంచామని శక్తికాంత తెలిపారు. ఇంతక్రితం 2019లో ఈ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.1.6 లక్షలకు పెంచుతూ ఆర్‌బిఐ నిర్ణయం తీసుకుంది.
కీలక వడ్డీ రేట్లను వరుసగా 11వ సారి యథాతథంగా కొనసాగించాలని ఆర్‌బిఐ నిర్ణయించింది. అయితే బ్యాంకుల్లో నగదు లభ్యత సమస్యలను పరిష్కరించాలని భావించినట్లు శక్తికాంత తెలిపారు. ఇందుకోసం నగదు నిల్వల నిష్పత్తి (సిఆర్‌ఆర్)ను 4.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించామన్నారు. దీంతో బ్యాంకులు మరిన్ని రుణాలు మంజూరు చేసేందుకు వీలుంటుందన్నారు. ఈ నిర్ణయంతో బ్యాంకింగ్‌లోకి అదనంగా రూ.1.16 లక్షల కోట్ల నిధులు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఖాతాదారుల డిపాజిట్లలో కొంత సొమ్మును ఆర్‌బిఐ వద్ద జమ చేయడమే సిఆర్‌ఆర్. దీంతో డిపాజిట్‌దారుల సొమ్ముకు రక్షణ కల్పించాలనేది దీని ప్రధాన ఉద్దేశ్యం. అదే విధంగా ఇకపై చిను బ్యాంకులు కూడా యుపిఐ ద్వారా క్రెడిట్ లైన్‌ను ఆఫర్ చేసేందుకు అనుమతి కల్పించినట్లు శక్తికాంత తెలిపారు.
వృద్ధి 6.6 శాతమే..
వరుసగా 11వ సారి రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు శక్తికాంత వెల్లడించారు. 2023 ఫిబ్రవరి నుంచి ఈ వడ్డీ రేటు మారలేదు. ద్రవ్యోల్బణం, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొనిఈసారి కూడా మార్పులు చేయొద్దనినిర్ణయించామన్నారు. 2024-25లో వాస్తవ జిడిపి వృద్ధి రేటు 6.6శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. గత సమీక్షాలో ఈ అంచనా 7.2 శాతంగా ఉంది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో వృద్ధి రేటు అంచనాల కంటే భారీగా తగ్గి 5.4 శాతంగా నమోదయ్యింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024ా25కుగాను జిడిపి అంచనాలకు భారీగా కోత పెట్టింది. ఇంతక్రితం 2023ా24లో ఏకంగా 8.2 శాతం వృద్థి చోటు చేసుకుంది. దీంతో పోల్చితే భారీగా తగ్గనుందనిస్పష్టమవుతోంది. 2024ా25లో రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను ఆర్‌బిఐ పెంచింది. గతంలో దీన్ని 4.5శాతంగా పేర్కొనగా.. తాజాగా 4.8శాతానికి పెరగొచ్చనివిశ్లేషించింది. ఆహార పదార్థాల ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం అంచనాలను పెంచాల్సి వచ్చిందనిశక్తికాంత తెలిపారు. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు బలంగా కొనసాగుతున్నాయన్నారు. రూపాయి విలువను బలోపేతం చేసేందుకు ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లపై వడ్డీరేటు పరిమితిని పెంచుతున్నామన్నారు.
ఆ సైబర్ ఖాతాల పనిపట్టాలి
అన్యాయంగా అమాయకుల సొమ్మును కొల్లగొడుతోను సైబర్ నేరగాళ్ల పనిపట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) భావించింది. అక్రమంగా కొట్టేసిన సొమ్మును నకిలీ ఖాతాలకు మళ్లించి ఆపై అవసరాలకువాడుకుంటును ‘మ్యూల్ ఎకౌంట్స్’ పనిపట్టాలని బ్యాంక్‌లకు ఆర్‌బిఐ సూచించింది. మ్యూల్ హంట్ పేరుతో ఆ ఖాతాలను ఏరిపారేయలని ఆర్‌బిఐ గవరుర్ శక్తికాంత దాస్ అనాురు. సైబర్ నేరగాళ్లు దోచుకును సొమ్మును దాచుకోవడానికి మ్యూల్ ఖాతాలను వినియోగిస్తున్నారన్నారు. మ్యూల్ ఖాతాలు సహా వివిధ ఆర్థిక మోసాలను అరికట్టడానికి ‘జీరో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్’ పేరిట ఆర్‌బిఐ హ్యాకథాన్ నిర్వహిస్తోందన్నారు. దీంతో పాటు ఎఐ, మెషిన్ లెరిుంగ్‌తో పనిచేసే మ్యూల్ హంటర్ ఎఐ మోడల్‌ను ఆవిష్కరించామనాురు. తమ రిజర్వ్ బ్యాంక్ ఇనోువేషన్ హబ్ దీన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా నిర్వహిస్తోందని శక్తికాంత తెలిపారు. ఇది మ్యూల్ ఖాతాలను సమర్థంగా గుర్తించగలదనాురు. రెండు పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులతో కలిసి ప్రయోగాత్మకంగా నిర్వహించిన పరీక్షల్లో సత్ఫలితాలు వచ్చాయనాురు. మ్యూల్ ఖాతాలకుచెక్ పెట్టేందుకుమిగిలిన భ్యాంకులు కూడా ఇనోువేషన్ హబ్‌తో జట్టు కట్టాలనాురు. బ్యాంకులు కూడా సైబర్ సెక్యూరిటీనిమెరుగుపరచడంతో పాటు సైబర్ మోసాల నివారణ, లావాదేవీలపై పర్యవేక్షణ ఉంచాలని సూచించారు.
మార్కెట్లకు రుచించలే..
ఆర్‌బిఐ నిర్ణయాలు స్టాక్ మార్కెట్లు, ఇన్వెస్టర్లకు రుచించలేదు. దీంతో వరుసగా ఐదు రోజులు లాభాల్లో సాగిన మార్కెట్లకు శుక్రవారం బ్రేక్ పడింది. వృద్ధి రేటు తగ్గడం, ద్రవ్యోల్బణం పెరగడం, వడ్డీ రేట్ల యథాతథం ప్రకటనలతో అమ్మకాలు చోటు చేసుకున్నాయి. దీంతో బిఎస్‌ఇ సెన్సెక్స్ తుదకు57 పాయింట్ల నష్టంతో 81,709కు జారింది. నిఫ్టీ 36 పాయింట్ల నష్టంతో 24,673 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, ఎల్‌అండ్‌టి, ఐటిసి షేర్లు అధికంగా లాభపడగా.. అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ సూచీలు అధిక నష్టాలను చవి చూశాయి.