- బెట్టింగ్ యాడ్స్ ఎక్కువే
- ఎస్‌ఎస్‌సిఐ రిపోర్ట్
ముంబయి : రియల్ ఎస్టేట్, ఆఫ్‌షోర్ బెట్టింగ్ రంగాలలో వినియోగదారులను తప్పుదోవ పట్టించే చట్టవిరుద్ధ ప్రకటనలు భారీగా పెరిగాయని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఎస్‌సిఐ) వెల్లడించింది. 2024-25 తొలి అర్థవార్షిక ఫిర్యాదుల రిపోర్ట్‌ను ఎస్‌ఎస్‌సిఐ విడుదల చేసింది. ఏప్రిల్-సెప్టెంబర్ 2024 మధ్య కాలంలో మొత్తంగా 4016 ఫిర్యాదులను సమీక్షించినట్లు తెలిపింది. ఉల్లంఘనలకు పాల్పడిన మొత్తం ప్రకటనల్లో రియల్టీ 34 శాతం, చట్టవిరుద్ధమైన బెట్టింగ్ 29 శాతం, ఆరోగ్య సంరక్షణ 8 శాతం, వ్యక్తిగత సంరక్షణ 7 శాతం, ఆహారం, పానీయాలు 6 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయని తెలిపింది. 3031 ప్రకటనలకు కొంత సవరణలు అవసరమని గుర్తించినట్లు పేర్కొంది.
2087 ప్రకటనలు చట్టాన్ని ఉల్లంఘించినట్లు గుర్తించినట్లు పేర్కొంది. రియాల్టీకి సంబంధించి 1027 ప్రకటనలు, అక్రమ బెట్టింగ్‌ను ప్రోత్సహించే మరో 890 ప్రకటనల సమాచారాన్ని సమాచార, మంత్రిత్వ శాఖకు పంపించినట్లు వెల్లడించింది.