టివిఎస్‌ ఐ క్యూబ్‌ స్కూటర్ల రీకాల్‌

Jun 8,2024 22:48 #Business

న్యూఢిల్లీ : ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టివిఎస్‌ మోటార్‌ కంపెనీ తన ఐ-క్యూబ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను రీకాల్‌ చేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ‘ప్రోయాక్టివ్‌ ఇన్‌స్పెక్షన్‌’ కోసం వాటిని రీకాల్‌ చేస్తున్నట్లు పేర్కొంది. 2023 జూలై 10 నుంచి 2023 సెప్టెంబర్‌ తొమ్మిదో తేదీ మధ్య తయారైన స్కూటర్లను రీకాల్‌ చేస్తున్నామని వెల్లడించింది. ఐ-క్యూబ్‌ స్కూటర్లలో బ్రిడ్జి ట్యూబ్‌ ఆఫ్‌ యూనిట్స్‌ను తనిఖీ చేయడానికి వినియోగదారులను సంప్రదిస్తున్నట్లు తెలిపింది. వెహికల్‌ రైడ్‌ హ్యాండ్లింగ్‌ సజావుగా సాగేందుకు తనిఖీ చేస్తున్నామని పేర్కొంది. దీనికి ఎటువంటి చార్జీ వసూలు చేయబోమని తెలిపింది. ఐ క్యూబ్‌ స్కూటర్‌ ప్రారంభ ధర రూ.94,999గా ఉంది.

➡️