దసరా ప్రయాణాల్లో 62 శాతం పెరుగుదల : రెడ్‌ బస్‌ అంచనా

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత దసరా పండుగ ప్రయాణాల్లో భారీ పెరుగుదల ఉండొచ్చని ట్రావెల్‌ ప్లాట్‌పామ్‌ రెడ్‌బస్‌ పేర్కొంది. పండుగేతర సమయం సెప్టెంబర్‌ 26-30తో పోల్చితే అక్టోబర్‌ 10-14 రోజుల్లో ప్రయాణికుల్లో 62 శాతం వృద్థి ఉండొచ్చని అంచనా వేసింది. ఎక్కువ మంది ప్రయాణికులు తమకు ఇష్టమైన వారితో ఈ పండుగని జరుపుకునేందుకు సొంతుళ్లకు వెల్లడమే ఇందుకు కారణమని తెలిపింది. అంతరాష్ట్ర ప్రయాణికుల్లో 84 శాతం డిమాండ్‌ ఉండొచ్చని పేర్కొంది.

➡️