ముంబయి : ఈ ఏడాది మార్చిలో సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఐపి) పెట్టుబడుల్లో తగ్గుదల చోటుచేసుకుంది. 2025 ఫిబ్రవరిలో రూ.25,999 కోట్లుగా ఉన్న పెట్టుబడులు.. మార్చిలో స్వల్పంగా 0.28 శాతం తగ్గి రూ.25,926 కోట్లుగా నమోదయ్యాయి. అయినప్పటికీ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ మొత్తం ఎయుఎం 23.11 శాతం వృద్ధితో రూ. 65.74 లక్షల కోట్లకు చేరిందని అసోసియేషన్ ఆఫ్ మ్చూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఎఎంఎఫ్‌ఐ) తెలిపింది. రిటైల్ పెట్టుబడిదారులలో అవగాహన పెరగడం, మ్యూచువల్ ఫండ్లపై నమ్మకంతో ఎయుఎం పెరిగడానికి కారణమని ఎఎంఎఫ్‌ఐ సిఇఒ వెంకట్ చలసాని పేర్కొన్నారు.
