పండగ వేళ … తగ్గిన పసిడి ధర

అమరావతి : పండగ వేళ … పసిడి ధర తగ్గింది.. ! ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్లు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో … కొన్ని స్టాక్‌లు ఆకర్షణీయంగా కనిపిస్తుండటంతో చాలా మంది బంగారంలోని పెట్టుబడులను ఈక్వీటీలకు మళ్లిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి బంగారం ధరతో పోలిస్తే పండగవేళ అంటే మంగళవారం పసిడి ధర తగ్గిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్‌ రేట్లు ఎలా ఉన్నాయంటే … హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.73,300 (22 క్యారెట్స్‌), రూ.79,960 (24 క్యారెట్స్‌) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్స్‌పై రూ.100, 24 క్యారెట్స్‌పై రూ.110 చొప్పున తగ్గింది. చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రేటు రూ.110 తగ్గింది. దీంతో గోల్డ్‌ రేటు రూ.73,300 (22 క్యారెట్స్‌ 10 గ్రామ్స్‌ గోల్డ్‌), రూ.79,960 (24 క్యారెట్స్‌ 10 గ్రామ్‌ గోల్డ్‌)కు చేరింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్‌ పసిడి ధర రూ.100 తగ్గి రూ.73,450కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.110 దిగజారి రూ.80,110 వద్దకు చేరింది. ఇక సిల్వర్‌ ధరలు ఎలా ఉన్నాయంటే …. బంగారం ధరలు మంగళవారం తగ్గినట్లే వెండి ధరల్లోనూ మార్పులొచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు కేజీ వెండి రేటు రూ.2,000 తగ్గి రూ.1,00,000 వద్దకు చేరింది.

➡️