న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండిస్టీస్‌కు చెందిన రిలయన్స్ జియో ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారతీ ఎయిర్‌టెల్ బాటలోనే జియో కూడా భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి వీలుగా స్టార్‌లింక్‌లో భాగస్వామ్యమయ్యింది. ఈ ఒప్పందంతో దేశంలో హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్ని అందివ్వనున్నట్లు రిలయన్స్ జియో సిఇఒ మాథ్యూ ఒమన్ ఓ ప్రకటనలో తెలిపారు. జియో సంస్థ తన రిటేల్ ఔట్‌లెట్ల ద్వారా స్టార్‌లింక్ పరికరాలను అందించనుందన్నారు.
