తగ్గిన రిటైల్‌ ద్రవ్యోల్బణం

ముంబయి : దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం సూచీలో తగ్గుదల చోటు చేసుకుంది. ఈ ఏడాది మార్చిలో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ) 3.34 శాతానికి దిగివచ్చిందని కేంద్రం వెల్లడించింది. ఇది 2019 సెప్టెంబర్‌ నాటి కనిష్ట స్థాయి. గడిచిన ఫిబ్రవరిలో సిపిఐ 3.61 శాతంగా చోటు చేసుకుంది. కాగా ఇటీవల అహారోత్పత్తుల ధరలు దిగిరావడంతో ద్రవ్యోల్బణం సూచీ సానుకూలంగా నమోదయ్యిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొత్తం సిపిఐలో సగం మేర వాటా కలిగిన ఆహార ద్రవ్యోల్బణం 2.69 శాతానికి పడిపోయింది. ఇది ఫిబ్రవరిలో 3.75 శాతంగా నమోదయ్యింది.

➡️