మార్చిలో 4.85 శాతంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం

Apr 12,2024 21:10 #Business

న్యూఢిల్లీ : ఈ ఏడాది మార్చిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ) 4.85 శాతంగా నమోదయ్యిందని కేంద్ర గణంకాల శాఖ తెలిపింది. ఇంతక్రితం మాసం ఫిబ్రవరిలో 5.09 శాతంగా ఉందని పేర్కొంది. గడిచిన నెలలో పట్టణ సిపిఐ 4.14 శాతంగా, గ్రామీణ ద్రవ్యోల్బణం 5.45 శాతంగా నమోదయ్యింది. ఆహార ద్రవ్యోల్బణం 8.66 నుంచి 8.52 శాతానికి దిగి వచ్చింది. దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుతున్నప్పటికీ.. ఇప్పటికీ నిర్దేశిత 4 శాతం ఎగువనే నమోదవుతోందని ఇటీవల ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. రెండేండ్ల క్రితం 2022 ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.8 శాతం గరిష్టానికి ఎగిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సాధారణ వర్షపాతం నమోదైతే రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉండొచ్చని ఆర్‌బిఐ అంచనా వేసింది.

➡️