మారుత్‌ డ్రోన్స్‌కు రూ.52 కోట్ల నిధులు

Nov 5,2024 22:31 #Funding, #Marut Drones, #Rs.52 crore

హైదరాబాద్‌ : సిరీస్‌ ఎ ఫండింగ్‌లో భాగంగా రూ.52 కోట్ల (6.2 మిలియన్‌ డాలర్లు) నిధులు అందుకున్నట్లు మారుత్‌ డ్రోన్‌ టెక్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తోన్న ఈ సంస్థ లోక్‌ క్యాపిటల్‌ నుండి ఈ ఫండ్స్‌ను సేకరించింది. నైపుణ్యం కలిగిన నిపుణులకు శిక్షణ ఇవ్వడానికి 17 కొత్త డ్రోన్‌ అకాడమీలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మారుత్‌ డ్రోన్స్‌ సిఇఒ, సహ వ్యవస్థాపకుడు ప్రేమ్‌ కుమార్‌ విస్లావత్‌ పేర్కొన్నారు. భారతీయ రైతులను శక్తివంతం చేయడానికి, అన్ని రంగాలలోని సంస్థల కోసం డ్రోన్‌ ఆధారిత సేవలను సమగ్రపరచడానికి అప్లికేషన్‌లను అభివృద్థి చేయడానికి ఈ నిధులు మద్దతును ఇవ్వనున్నాయన్నారు. తయారీ సామర్థ్యాన్ని ఏడాదికి 3000 డ్రోన్‌లకు పెంచడానికి, వచ్చే ఐదేళ్లలో రూ.1000 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలి కల్పించనున్నాయన్నారు.

➡️