న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ప్రథమార్థం (హెచ్1)లో రూ.90 కోట్ల లాభాలు సాధించినట్లు బీమా సంస్థ అవివా ఇండియా తెలిపింది. అదే సమయంలో అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (ఎయుఎం) 13 శాతం పెరిగి రూ.14,636 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. గ్రాస్ రిటెన్ ప్రీమియం (జిడబ్ల్యుపి) రూ.548 కోట్లుగా నమోదయ్యింది. ఈ కాలంలో 98.98 శాతం క్లెయిమ్‌ల చెల్లింపులు చేసినట్లు వెల్లడించింది. గతేడాది ఇదే కాలంలో రూ.63 కోట్ల లాభాలు నమోదు చేసినట్లు పేర్కొంది.