న్యూఢిల్లీ : ప్రారంభ ట్రేడ్‌లో సోమవారం ఉదయం అమెరికా డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో రిస్క్ ఆఫ్ సిట్యుయేషన్ ( షేర్స్‌ను అమ్మి బంగారం, డాలర్‌ను కోనుగోలు చేయడం ) డాలర్‌ను స్థిరంగా ఉంచినట్లు విశ్లేషకులు తెలిపారు. విదేశీ నిల్వలు తగ్గుముఖం పట్టడం మరియు దేశీయ ఈక్విటీ మార్కెట్లలో గణనీయమైన తిరోగమనం కారణంగా మార్కెట్లలో రూపాయి విలువ తగ్గిందని ఫారెక్స్ ట్రేడర్స్ పేర్కొన్నారు. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్‌లో 83.78 వద్ద ప్రారంభమై, డాలర్‌తో 83.80వద్ద ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోయింది. గత ముగింపుతో పోలిస్తే 8 పైసల పతనాన్ని నమోదు చేసింది.
