నవంబర్‌లో రూపాయి అత్యంత పేలవం

Nov 30,2024 22:55 #Business, #November, #Rupee weakest
  • 0.5 శాతం క్షీణత

న్యూఢిల్లీ : తమ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. రూపాయి విలువను అమాంతం పెంచుతామని.. డాలర్‌కు సమానంగా రూపాయి విలువ చేస్తామని.. రూపాయి కరెన్సీల కోసం విదేశాలు లైన్‌ కట్టాలని నరేంద్ర మోడీ 2013లో చేసిన ప్రచార అర్బాటాలకు ప్రస్తుత పరిస్థితికి పొంతన లేకుండా పోయింది. ప్రస్తుత ఏడాది నవంబర్‌లో అయితే రూపాయి విలువ అత్యంత పేలవంగా నమోదయ్యింది. ఈ ఒక్క నెలలోనే 0.5 శాతం విలువ కోల్పోయింది. అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం తర్వాత డాలర్‌ విలువ మరింత పెరగడం, భారత మార్కెట్ల నుంచి భారీగా విదేశీ పోర్ట్‌ఫోలియో నిధులు తరలిపోవడంతో గడిచిన ఎనిమిది నెలల్లో ఎప్పుడూ లేని స్థాయిలో రూపాయి విలువ పడిపోయింది. శుక్రవారం నాటికి డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.48కు పరిమితమయ్యింది. అక్టోబర్‌ ముగింపు నాటికి రూపాయి విలువ 82.71గా ఉంది. నరేంద్ర మోడీ ప్రధాని కాకముందు 2014లో డాలర్‌తో రూపాయి విలువ 60లోపే ఉండటం విశేషం.

➡️