ముంబయి : మ్యూచువల్ ఫండ్లలో స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌లతో ఇన్వెస్టర్లకు మద్దతును ఇవ్వడానికి తమ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో ఎస్ ఫీచర్‌ను జోడించినట్లు ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ తెలిపింది. ఇది పెట్టుబడిదారులుకు తగిన సమాచారంతో, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి వీలు కల్పించే సంబంధిత పరిజ్ఞానము, సాధనాలను అందిస్తుందని పేర్కొంది.
