ప్రజాశక్తి – హైదరాబాద్ : సాయి లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ డిసెంబర్ 11న ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)కు రానున్నట్లు ప్రకటించింది. ఈ ఇష్యూలో రూ.1 ముఖ విలు కలిగిన ఈక్విటీ షేర్ ధరల శ్రేణీని రూ.522-549గా నిర్ణయించింది. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ కోసం డిసెంబర్ 10న ఇష్యూ తెరిచి ఉటుందని పేర్కొంది. కనీసం 27 ఈక్విటీ షేర్లు బిడ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ఇష్యూ కింద రూ.950 కోట్ల వరకు నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ కంపెనీ తెలిపింది. ఇందులో రూ.720 కోట్లను అప్పులు చెల్లించడానికి.. మిగితా మొత్తం కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు వెల్లడించింది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/12/sai-1.jpg)