పసిడి బాండ్ల విక్రయాలు ప్రారంభం

Feb 12,2024 20:47 #Business, #Gold

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగో విడత సావరిన్‌ పసిడి బాండ్ల సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమైంది. సోమవారం నుంచి వివిధ విత్త సంస్థల వేదికల్లో ఆన్‌లైన్‌లో అమ్మకాలను ఆర్‌బిఐ అందుబాటులోకి తెచ్చింది. 16వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సబ్‌స్క్రిప్షన్‌ అందుబాటులో ఉంటుంది. ఒక్కో గ్రాము ధరను రూ.6,263గా ఆర్‌బిఐ నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌ ఇస్తోంది. ఎనిమిదేళ్ల తర్వాత పసిడి ధర ఎంత ఉంటే అంత చెల్లిస్తుంది.

➡️