న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్ ఇటీవల తన గెలాక్సీ ఫోన్లలో ఎఐ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. అయితే వీటిని కొద్ది కాలమే ఉచితంగా అందిస్తామని.. ఆ తర్వాత నగదు వసూలు చేస్తామని ఆ కంపెనీ తెలిపింది. వచ్చే ఏడాది నుంచే ఇది అమల్లోకి రానుందని వెల్లడించింది. గెలాక్సీ ఎస్ 24 సిరీస్ ఫోన్లలో తొలుత ఎఐ ఫీచర్లను జోడించింది. 2025 చివరి నుంచి కొన్ని ఎఐ ఫీచర్లకు ఫీజు ఉంటుందని తాజాగా స్పష్టం చేసింది.