న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్ శుక్రవారం గెలాక్సీ ఎఫ్56 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసినట్లు ప్రకటించింది. 6.7 అంగుళూల సూపర్ అమెలెడ్ డిస్ప్లే, స్పాప్‌డ్రాగన్ చిప్‌సెట్, 50ఎంపి ప్రధాన కెమెరా సహా 8ఎంపి, 2ఎంపి కెమెరాలతో ఆవిష్కరించినట్లు తెలిపింది. సెల్ఫీ కోసం 50 ఎంపి కెమెరాను అమర్చినట్లు పేర్కొంది. 8జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.27,999గా నిర్ణయించింది.
