క్వాంటం డాట్‌ ఫీచర్‌తో సామ్‌సంగ్‌ టివిలు

Jun 10,2024 21:10 #samsung, #TV

గూర్‌గావ్‌ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్‌ కొత్తగా క్వాంటం డాట్‌ ఫీచర్‌తో 2024 క్యూఎల్‌ఇడి 4కె ప్రీమియం టివి సిరీస్‌ను విడుదల చేసినట్లు సోమవారం ప్రకటించింది. దీని ప్రారంభ ధరను రూ.65,990గా ప్రకటించింది. క్వాంటం టెక్నాలజీతో వినియోగదారులు నిజమైన రంగుల బిలియన్‌ షేడ్స్‌ను ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుందని తెలిపింది. 55, 65,75 అంగుళాల్లో లభించనున్న ఈ టివిలతో ప్రీమియం ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రపంచంలోకి ప్రవేశించడానికి వినియోగదారులకు మార్గం సుగమం చేస్తుందని పేర్కొంది.

➡️