చరిత్రలో తొలిసారిగా శాంసంగ్ కార్మికుల సమ్మె 

సియోల్ : శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కార్మికులు చరిత్రలో తొలిసారి సమ్మెకు దిగారు. శాంసంగ్ చిప్‌ల తయారీ విభాగం కార్మికులు శుక్రవారం సమ్మెకు దిగారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్‌లో కీలకమైన మెమొరీ చిప్‌లను తయారు చేయడం ద్వారా మార్కెట్‌ను స్వాధీనం చేసుకునేందుకు శామ్‌సంగ్ ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో సమ్మె నిర్వహించారు. వేతనాల పెంపుదల, బోనస్‌లపై జరిగిన చర్చలు విఫలమవడంతో కార్మికులు సమ్మెకు దిగారు. సమ్మెకు దక్షిణ కొరియాలో అతిపెద్ద కార్మిక సంఘం అయిన నేషనల్ శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ యూనియన్ నాయకత్వం వహించింది.

➡️