ఎఐ దిశగా ‘సాప్‌’… సుమారు 8,000 మందిపై ప్రభావం ..

Jan 24,2024 15:06 #Artificial Intelligence, #SAP

బెర్లిన్‌ :   జర్మనీ సాఫ్ట్‌వేర్‌ సంస్థ శాప్‌ (ఎస్‌ఎపి. ఎస్‌ఇ) తమ సంస్థను కృత్రిమ మేథస్సు (ఎఐ) దిశగా మార్చనున్నట్లు ప్రకటించింది. దీంతో సుమారు 8,000మందికి పైగా కార్మికులపై వేటు పడనుంది. సుమారు 2.2 బిలియన్‌ డాలర్లతో సంస్థ పునర్‌నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. దీనికోసం మూలధన సంస్థ సాఫైర్‌ వెంచర్స్‌ నుండి ఎఐ స్టార్టప్‌ల మద్దతుతో 1 బిలియన్‌ డాలర్ల కంటే అధికంగా పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది.

గూగుల్‌,  అమెజాన్,  మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ టెక్‌ సంస్థలు ఎఐపై దృష్టి సారిస్తున్నాయి. దీంతో ఇటీవల ఉద్యోగుల తొలగింపులను చేపట్టిన సంగతి తెలిసిందే. కంపెనీ వెబ్‌సైట్‌ ప్రకారం.. సాప్‌లో 10,500 కంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్నారు. స్వచ్ఛంద సెలవు చెల్లింపు పథకాలు, ప్రొఫెషనల్‌ రీసైక్లింగ్‌ చర్యలతో ఉద్యోగులను తొలగించనుంది.   పునర్నిర్మాణ ఖర్చులు 2024 ఏడాది అర్థభాగంలో అధికంగా ఉండవవచ్చని, దీంతో కంపెనీపై స్వల్ప ప్రభావం పడే అవకాశం ఉందని సాప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ క్రిస్టియన్‌ క్లెయిన్‌ తెలిపారు. 2025 నాటికి నిర్వహణ లాభాలకు అదనంగా 500 మిలియన్ల యూరోలు పొందేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.

➡️