ఏడాదిలో రెండు లక్షలు పెరిగిన విక్రేతలు

  • అమెజాన్‌ సేల్స్‌ డైరెక్టర్‌ గౌరవ్‌ వెల్లడి

ప్రజాశక్తి – హైదరాబాద్‌ : గడిచిన ఏడాది కాలంలో దేశ వ్యాప్తంగా తమ వేదికలో కొత్తగా రెండు లక్షల మంది విక్రేతలు పెరిగారని అమెజాన్‌ సేల్స్‌ డైరెక్టర్‌ గౌరవ్‌ భాట్నగర్‌ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతేడాది 14 లక్షల మంది విక్రేతాలు ఉండగా.. ఈ ఏడాది 16 లక్షలకు చేరారని తెలిపారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 55వేల మంది అమ్మకందారులు ఉన్నారన్నారు. అన్ని కేటగిరీలపై విక్రయ ఫీజులను 3-12 శాతం వరకు తగ్గించామన్నారు. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో అదే రోజు 10 లక్షల ఉత్పత్తులను, తర్వాత రోజు 40 లక్షల ఉత్పత్తులను డెలివరీ చేస్తున్నామన్నారు. ఈ సేల్‌కు విశేష స్పందన లభిస్తుందన్నారు.

➡️