స్పెషల్‌ సెషన్‌లో సెన్సెక్స్‌కు లాభాలు

May 19,2024 09:12 #Business, #sensex

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు శనివారం నిర్వహించిన స్పెషల్‌ సెషన్‌లో లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 89 పాయింట్లు పెరిగి 74,006కు చేరగా.. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 22,502 వద్ద ముగిసింది. మొత్తం రెండు సెషన్లలో ప్రత్యేక ట్రేడింగ్‌ నిర్వహించారు. సాధారణంగా శనివారం మార్కెట్లకు సెలవు. కానీ.. ప్రాథమిక సైట్‌లో ఏమైనా లోపాలు తలెత్తితే ఎదుర్కొనే సన్నద్దతను పరీక్షించేందుకు ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్‌ విభాగాల్లో ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌ను ఏర్పాటు చేశారు. మొదటి సెషన్‌ ఉదయం 9.15 గంటలకు ప్రారంభమై 10.15 గంటల వరకు నిర్వహించగా.. రెండో సెషన్‌ 11.30 – 12.30 గంటల మధ్య నిర్వహించారు.

➡️