నగరంలో నేషనల్‌ మార్ట్‌ ఏడో స్టోర్‌ ఏర్పాటు

Jun 8,2024 22:44 #National Mart, #shop

హైదరాబాద్‌ : రిటైల్‌ ఉత్పత్తుల విక్రయ చెయిన్‌ నేషనల్‌ మార్ట్‌ హైదరాబాద్‌లో తన 7వ స్టోర్‌ను తెరిచింది. మెహదీపట్నంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను శనివారం ఎఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపి అసదుద్దీన్‌ ఒవైసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ స్టోర్‌లో కిరాణా, స్టేషనరీ, గృహ అండ్‌ కిచెన్‌ అప్లయెన్సెస్‌, కుక్‌ వేర్‌, పాదరక్షలు, పురుషులు, మహిళలు, పిల్లల కోసం దుస్తులు ఇంకా మరెన్నో ఉత్పత్తులను సరసమైన ధరలకే లభిస్తాయని నేషనల్‌ మార్ట్‌ వ్యవస్థాపకుడు యశ్‌ అగర్వాల్‌ తెలిపారు.
నాణ్యత, చౌకగా ఉండే బ్రాండ్‌ మిశ్రమాన్ని మెహిదీపట్నానికి తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

➡️