ముంబయి : ట్రేడింగ్ అనుభవాన్ని మరింత తేలిక చేసే రీతిలో డిస్కౌంట్ బ్రోకింగ్ కోసం ‘షీట్స్’ను ప్రవేశపెట్టినట్లు షేర్.మార్కెట్ తెలిపింది. ట్రేడింగ్ అనుభవాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లి, అవగాహనతో కూడిన పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేందుకు షీట్స్ యూజర్లకు వీలు కల్పిస్తుందని ఫోన్‌పేకు చెందిన ఈ సంస్థ పేర్కొంది. బ్రోకింగ్ రంగంలోనే మొదటిసారిగా షీట్స్‌ను ఆవిష్కరిస్తున్నామని తెలిపింది. రాబోయే రోజుల్లో మరిన్ని అత్యాధునిక ఫీచర్లను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది.