న్యూఢిల్లీ : ఎన్‌ఇసి ఇండియా డిస్ల్పే వ్యాపారాన్ని సొంతం చేసుకున్నట్లు షార్ప్ బిజినెస్ సిస్టమ్స్ (ఇండియా) తెలిపింది. తద్వారా భారతదేశ విజువల్ సొల్యూషన్స్ మార్కెట్‌ను విప్లవాత్మకంగా మార్చనున్నట్లు ఆ కంపెనీ విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ విలీనం షార్ప్, ఎన్‌ఇసి రెండింటి ప్రస్తుత భాగస్వాముల కోసం ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో విలువను పెంచనుందని పేర్కొంది. ప్రస్తుతం షార్ప్ సంస్థ డిజిటల్ మల్టీఫంక్షనల్ ప్రింటర్లు, ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్‌లు, డైనాబుక్ ల్యాప్‌టాప్‌లతో సహా స్మార్ట్ బిజినెస్ సొల్యూషన్స్ వర్టికల్‌లో విస్తృత శ్రేణి ఉత్పత్తులను కలిగి ఉంది. ఎన్‌ఇసి డిస్ప్లే బిజినెస్‌తో కలువడం ద్వారా తమ ప్రస్తుత ఆఫర్‌లను మరింత మెరుగుపరుస్తుందని షార్ప్ బిజినెస్ సిస్టమ్స్ (ఇండియా) ఎండి ఒసాము నరిటా పేర్కొన్నారు.
