న్యూఢిల్లీ : షావోమి అధికారికంగా తన షావోమి 15 సీరిస్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసినట్లు ప్రకటించింది. ఇటీవల మొబైల్ వాల్డ్ కాంగ్రెస్‌లో ఆవిష్కరించిన ఈ సీరిస్‌ను తాజాగా ఇక్కడి మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. షావోమి 15, షావోమి 15 అల్ట్రా రెండు వేరియంట్లను స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, లైకా కెమెరాలు, ఎఐ సామర్థ్యాలు, ప్రీమియం హార్డ్‌వేర్ ఫీచర్లలో అందిస్తోన్నట్లు తెలిపింది. షావోమి 15 ధరను రూ.64,999గా, అల్ట్రా ధరను రూ.1,09,999గా నిర్ణయించింది. అల్ట్రా వేరియంట్‌ను 200 ఎంపి లైకా పెరిస్కోప్ లెన్స్ కెమెరా, 50 ఎంపి ప్రైమరీ కెమెరా, 32 ఎంపి సెల్ఫీ కెమెరాతో తీసుకొచ్చింది.
